భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిఘా పెట్టి అవినీతి అధికారిని రంగులతో సహా పట్టుకున్నారు. రూ. 25,000 లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ ఏడీ రమణారెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ అధికారికంగా వెల్లడించారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన రూ. 3 లక్షల పైచిలుకు విలువైన అధికారిక బిల్లును…





