భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : దేవనకొండ కూరగాయల మార్కెట్ వేలంలో ఈసారి ధర భారీగా పడిపోవడం స్థానికులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది రూ.12.50 లక్షలు పలికిన ఈ మార్కెట్ వేలం ఈసారి కేవలం రూ.2.15 లక్షలకు మాత్రమే పలికింది. ఎర్రగోటి శ్రీనివాసులుకు ఈ మార్కెట్ కేటాయించబడిందని పంచాయతీ కార్యదర్శి రఫీ తెలిపారు.
వేలంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచేవారు ముందుకు రాకపోవడంతో ఈసారి తక్కువ మొత్తానికే మార్కెట్‌ను కేటాయించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ధర తగ్గుదల వల్ల దేవనకొండ పంచాయతీకి సుమారు…


