భారత్ సమాచార్.నెట్, మెదక్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మోతీ నగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఆమె ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలు నెరవేర్చి, అభివృద్ధిని సాధించే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని, ‘చేతి’…





