భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అభినందించారు. “ప్రతిభకు దివ్యాంగత్వం అడ్డుకాదు” అని కలెక్టర్ స్పూర్తిదాయక సందేశం ఇచ్చారు.

 

ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్య, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారాల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు. ఉద్యోగాలు, సంక్షేమ…