భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ అన్న క్యాంటీన్‌లో దళితుడు సుమాల బాలను ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనపై కెవిపిఎస్ జిల్లా నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వివరాల ప్రకారం, బాల నిజాయితీగా సూపర్వైజర్‌గా పని చేస్తున్నప్పటికీ, కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తప్పుడు సమాచారం ఇచ్చి అతన్ని తొలగించారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, బాలను తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: కేవీపీఎస్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

