భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థానాలకు పోటీ చేయాలనుకుంటే దరఖాస్తు ఫారాన్ని నింపి ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఫార్మేట్ లో వారి పూర్తి వివరాలను నింపి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయబోవు సమావేశాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందజేయాలని కోరారు. ఎవరి వ్యక్తిగత అభ్యర్థన పత్రాలు వారే సమర్పించాలని…