భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం పాత ఊరిలోని ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1.50 లక్షల విలువైన వంట పాత్రలను దాతలు విరాళంగా అందజేశారు. అకౌంటెంట్ శంకర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యురాలు సుజాత ఈ సామగ్రిని ఆలయానికి సమర్పించినట్లు అర్చకుడు సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు సీతారామిరెడ్డి పాల్గొని దాతలను అభినందించారు. దాతల సహకారం ఆలయ అభివృద్ధికి దోహదపడుతుందని ఆలయ కమిటీ పేర్కొంది.