భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ తూర్పు ప్రాంతం భూకంపంతో వణికిపోయింది. నర్సింగ్డ్ జిల్లా సమీపంలో శుక్రవారం ఉదయం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జాతీయ భూకంప కేంద్రం (NCS) తెలిపింది. ఈ ప్రకంపనలతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ప్రారంభ నివేదికల ప్రకారం, ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
భూకంపం సంభవించగానే ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రహదారులపై పగుళ్లు ఏర్పడటంతో రవాణా వ్యవస్థలో అంతరాయం…


