భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: డోన్ పట్టణంలోని పాతపేట ప్రాంతం 6వ వార్డులో మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, టీడీపీ సీనియర్ నాయకుడు సుదీష్ రాజు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల పరిస్థితి గురించి స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. కమిషనర్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. సుదీష్ రాజు ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం తెలిపారు.