భారత్ సమాచార్.నెట్, కర్నూలు: భారత రాజ్యాంగాన్ని గౌరవించి, దాని విలువలకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె రాజ్యాంగ పీఠికను చదివి, హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగం దత్తత తీసుకోగా,…


