భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హింస మరోసారి పడగ విప్పింది. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో సోమవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను గ్రామానికి చెందిన బోయ పరమేశ్, బోయ వెంకటేశ్‌గా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యలకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 24న జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగానే…