భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోనిలో సీసీఐ మరిన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు తెచ్చిన పత్తిని మొత్తం కొనుగోలు చేసి “కండిషన్” పేరుతో వెనక్కి పంపకూడదని రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతు సంఘం ఆధ్వర్యంలో విగ్నేశ్వర, NDBL ఫ్యాక్టరీల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడ పత్తి తూకాలు, రేట్లు, నాణ్యత పరిశీలించి రైతులతో మాట్లాడుతుండగా కర్నూలు జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కే. వెంకటేశులు, ఉపాధ్యక్షుడు కే.…