భారత్ సమాచార్.నెట్, నిర్మల్: దైవ దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో నీట మునిగి ఐదుగురు మృతి చెందిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో నివాసముంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తుండగా ఐదుగురు గల్లంతయ్యారు. మృతులు రాకేష్ (17), వినోద్(18), రుతిక్ , మదన్(18)లుగా గుర్తించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.. అతని కోసం గాలిస్తున్నారు. గోదావరిలో తేలిన…