భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: శ్రీలంక (Sri Lanka)లో కురుస్తున్న భారీ వర్షాలు (Flood disaster) ప్రళయాన్ని తలపిస్తున్నాయి. వరదలు, కొండచరియలు కూలిపోవడంతో దేశవ్యాప్తంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు కనీసం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 600కు పైగా ఇళ్లు పూర్తిగా లేదా కొంతమేరకు దెబ్బతిన్నాయి.
రాజధాని కొలంబోకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బదుల్లా, నువారా ఎలియా ప్రాంతాల్లో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడటం వల్ల అత్యధిక నష్టం సంభవించింది. ఈ ప్రాంతాల్లో ఒక్కరోజులోనే…


