భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీపాదరావు నిరాడంబరత, నిజాయితీ కలిగిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు.

అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన తీసుకున్న నిష్పక్షపాత నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా సాగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట్ర…