భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: భువనగిరి మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన బాత్క నవీన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అనాజీపూర్ ZPHS పదవ తరగతి (2007-08 బ్యాచ్) తోటి స్నేహితులు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.32 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వీణ, సరిత, లావణ్య, శ్రవణ్, గణేష్ ఉన్నారు.
మరిన్ని కథనాలు:





