భారత్ సమాచార్, తిరుమల ;

వచ్చే నెల జూన్ 1వ తేదీ నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుడుతోంది. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో కన్నుల పండుగగా…