భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. మండల పరిధిలోని పిలుట్ల గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం వడగండ్ల వానకు ఈదురు గాలులు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. చేతికి వచ్చిన పంటకు నష్టం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగబడినందున అధికారులు స్పందించి తీగలు సరి చేయాలని రైతులకు కోరుతున్నారు.