భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దివ్యాంగులకు సేవ చేయడం దైవసేవతో సమానమని పేర్కొంటూ, ఎమ్మిగనూరులోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ యజమాని కె. రాఘవేంద్ర రెడ్డి రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం (డీఈఎఫ్) సంస్థకు బుధవారం ఒక గ్యాస్ కిట్టును బహూకరించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తమవంతు సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని, కిట్టు వితరణ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. డీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బి.సి. నాగరాజు, సంస్థ అవసరాలను గుర్తించి కిట్టు అందించిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి కృతజ్ఞతలు…