భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని గతంలో చేపట్టిన ఉద్యమ కేసులో భాగంగా శుక్రవారం వామపక్ష నేతలు మహబూబాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వామపక్షాల పోరాట ఫలితంగానే నాడు ఆర్టీసీ విలీనం సాధ్యమైందని, కార్మిక వ్యతిరేక విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాల కోసం…


