భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆలూరు ప్రాంత పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, పంటలకు సరైన మద్దతు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు బోయ మునిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి వినతిపత్రం సమర్పించారు.

గత 18 నెలలుగా ప్రభుత్వం రైతు సమస్యలపై చిత్తశుద్ధి చూపడం లేదని మునిస్వామి విమర్శించారు. మొంథా తుఫాన్ కారణంగా దిగుబడి తగ్గి, పత్తిలో తేమ శాతం 18%గా…