Boeing Dreamliner: బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్రం

భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదం (Plane Crash) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 (Boeing Dreamliner 787-8) విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు…
