భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇండ్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు అన్నారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభానికి గురువారం ఆమె హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజా సంక్షేమానికి తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు…