భారత్ సమాచార్, రాజకీయం : సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం మహాలక్ష‍్మి స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘‘లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే మీరంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారు. మీ కష్టం చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ ఉత్పత్తులను చూసిన, మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద షాపులను కట్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో…