భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన సోదరులు ఎన్.రామకృష్ణ రెడ్డి పులికనుమ ప్రాజెక్టు నుంచి పెద్దకడబూరు మండలానికి చెందిన ఎనిమిది గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలకు నీటి కొరత రాకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎన్. రామకృష్ణ రెడ్డి స్వయంగా ప్రాజెక్టు వద్ద జలహారతి చేసి నీటిని విడుదల చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ…