భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మండిపడ్డారు. బెంగాల్ బయట ఇలాంటి భయాందోళనలు, దాడులు, హింస ఎదుర్కొంటున్న తమ ప్రజలకు, వారి కుటుంబాలకు టీఎంసీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

బెంగాలీలనే ఇలా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. ‘ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి, అక్కడ భయభ్రాంతులకు గురవుతున్న బెంగాలీ కుటుంబాలకు మేం అండగా ఉంటాం. వారికి ఎలాంటి సహకారం అవసరమైనా అందిస్తాం. బెంగాలీ మాట్లాడటమే…