భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలూరు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు గురువారం మంత్రాలయంలో టీడీపీ నాయకుడు రాఘవేంద్ర రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆదోని ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జిల్లా హోదా అత్యంత అవసరమని, ఇది ప్రజల న్యాయమైన ఆకాంక్ష అని వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన రాఘవేంద్ర రెడ్డి, ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని హామీ…


