భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఉగ్రవాదాన్ని విడిచే వరకు పాక్‌కు సింధు జలాలు దక్కవని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. నీరు, రక్తం కలిసి ప్రవహించవని.. ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉండి.. ఒప్పందం కుదుర్చుకున్న వారు భారత్‌ కంటే పాక్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.

 

మాజీ ప్రధాని నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను.. ప్రస్తుతం…