భార‌త్ స‌మాచార్.నెట్, సూర్యాపేట‌: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాదావత్ కళ్యాణ్ నాయక్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో గిరిజన మోర్చా సీనియర్ నాయకులు అభినందించారు. అనంత‌రం ఆయ‌న‌కు శాలువాతో ఘ‌నంగా స‌న్మానించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో నాయ‌కులు బాలాజీ నాయక్, భూక్య ఫుల్ సింగ్ నాయక్, దావత్ సంతోష్ నాయక్, ధరావత్ రవి నాయక్, రవి నాయక్, సుబ్రహ్మణ్యం నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

…