భారత్ సమాచార్.నెట్: జమ్ముక‌శ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా క‌ల్పించేందుకు అవసరమైన చట్టాన్ని ఈ వ‌ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాల‌ని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖ‌ర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. అలాగే రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో లద్దాక్‌ను చేర్చేందుకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల‌ని లేఖలో కోరారు. గత ఐదేళ్లుగా జ‌మ్మూక‌శ్మీర్ ప్రజలు రాష్ట్ర హోదాను కోరుకుంటున్నారని తమ లేఖలో గుర్తు చేశారు. తమ ఈ డిమాండ్‌ చట్టపరమైందని.. ప్రజాస్వామ్యానికి…