భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి:  మోత్కూరు మున్సిపల్ కేంద్రం కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వద్ద ఆదివారం  కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మహేశ్వరం వెంకటేశ్వర్లు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు యాదగిరి,లక్ష్మణ్, రవీందర్,కృష్ణయ్య,గోవర్ధన్,శ్రీనివాస్, కరుణాకర్, కుల బాంధవులు పాల్గొన్నారు.