భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన చిరస్మరణీయ సేవలు భావితరాలకు ఆదర్శమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వద్ద శనివారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు బాపూజీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో…