భారత్ సమాచార్, హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో ఉన్న కర్నాటక సాహిత్య మందిరంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. మొత్తం 29మంది కళాకారులు ప్రదర్శన చేశారు. కుమారి కసుభ శ్రీవిద్య, మాదిరాజు అనన్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. శ్రీవిద్య, అనన్య మొదటి స్థానంలో నిలిచారు. గురువు కీర్తి వ్యాస్ ఆధ్వర్యంలో ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి.