భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మలిగే రామలింగయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం బడుగు, బలహీన వర్గాలకు, దళిత, గిరిజన వర్గాలకు ఒక గొప్ప రక్షణ కవచంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగంపై పొంచి ఉన్న ప్రమాదాల నుంచి దాన్ని కాపాడాలంటే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆస్పరి,…


