భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతరత్న, దేశ మాజీ ప్రధానమంత్రి, జై జవాన్ జై కిసాన్ నినాదకర్త, దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతిని ఇనుగుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలోని శాస్త్రి విగ్రహానికి గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్, సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్నతోపాటు వివిధ పార్టీల నాయకులు, సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబర జీవితం, రైల్వే శాఖ మంత్రిగా, భారత…