భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)పై గత కొద్దిరోజులుగా వస్తున్న విమర్శలకు లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు. ఆటగాళ్ల ప్రదర్శనలకే ఫలితాలు ఆధారపడతాయని, కోచ్‌ను తప్పుబట్టడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

 

గవాస్కర్ (Sunil Gavaskar) మాట్లాడుతూ.. “ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాల సమయంలో గంభీర్‌ (Gautam Gambhir)కు ఎవ్వరూ ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు పరాజయాలపై మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? కోచ్ బాధ్యత ఆటగాళ్లను సిద్ధం…