భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రానికి మహేశ్ బాబు చేస్తున్న కఠినమైన సన్నాహాలు, చూ పిస్తున్న అంకితభావం చూస్తుంటే.. జక్కన్న మరోసారి వెండితెర పై ఒక అద్భుతాన్ని ఆవిష్క రించబోతున్నారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ‘వారణాసి’లో ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్ర కోసం మహేశ్ బాబు కేరళకు చెందిన ప్రాచీన యుద్ధ విద్య ‘కలరిప…