భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా:   బొల్లారం జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్‌కు చెందిన అర్జున్ రామ్‌కు MDR ఫౌండేషన్ కుటుంబంగా నిలిచింది. సెక్యూరిటీగా పని చేస్తున్న ఆయనకు ఇక్కడ బంధువులు లేకపోవడంతో, కూతురు విజ్ఞప్తి మేరకు మాద్రి పృథ్వీరాజ్ ఆర్థిక సహకారంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వానికి ప్రతీకగా MDR ఫౌండేషన్ నిలిచింది. వీరి సేవలను స్థానిక ప్రజలు కొనియాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చిన వెంటనే తోడు ఉంటారని ప్రశంసించారు.