భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిపాలనా నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్…





