భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి నష్టాలను నివారించుకునేలా గ్రామాల్లో సర్పంచులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ హాజరయ్యారు. సమీక్షలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు,…