భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం 2025 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసిన 662 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1,22,47,500 గా ఉంది. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 1,170 మొబైల్ ఫోన్లు రికవరీ చేయగా, వాటి మొత్తం విలువ రూ.2,06,29,000గా అధికారులు తెలిపారు. తమకు పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి…