భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను కలిసిన ఈటల, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మహిపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, భగవంతుని కృపతో పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా…