భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘ఛావా’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి హిట్ చిత్రాలతో కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్న రష్మిక (Rashmika Mandanna) త్వరలో ‘మైసా’ (mysaa) అనే నాయికా ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా తాను ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నానని తెలిపింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి పరిశ్రమను గౌరవిస్తూ వందశాతం అంకితభావంతో పనిచేస్తానని చెప్పింది. తన ప్రయాణంలో అనుభవాలే తనకు అసలైన బలం అని…