భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి పైగా యువత, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, ఐటీడీపీ సభ్యులు, ప్రజాప్రతినిధులు,…