భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను ఆయా మండలాల పరిధిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి నెల్లికుదురులో శ్రీకారం చుట్టారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ నితీష్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల స్థాయిలోనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ప్రజావాణి ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి రావడం వల్ల ప్రజలకు సమయం,…