భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌సర్వీస్ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లికుదురు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ఆంగోత్ రాందాస్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ఇన్‌సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ బోధనా విధానాలకు బదులుగా వినూత్న, ప్రయోగాత్మక పద్ధతులను అనుసరిస్తే విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి పెరుగుతుందని…





