భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : ఆయిల్ పామ్ సాగు ఒక కల్పవృక్షం లాంటిదని, ఐదేళ్లు కష్టపడితే జీవితాంతం రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం హవేలీఘనాపూర్ మండలంలోని రైతు వేదిక వద్ద ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సహకార సంఘాల సీఈవోలు, రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రత్యేక…





