భారత్ సమాచార్.నెట్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర దాడికి కారణమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఎన్ఐఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు ముష్కరులకు ఆశ్రయం కల్పించిన పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.
వారిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. అలాగే…Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం.. వ్యక్తుల అరెస్ట్


