భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఉభయసభల్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లు సభ ముందుకు తెచ్చింది. బుధవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు.. తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేస్తే చట్టంగా మారనుంది. అప్పడు అధికారికంగా కేంద్రం గేజిట్ జారీ చేయనుంది. గత కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్…


