భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండలం ప్రజా భవన్, MLA క్యాంపు కార్యాలయం నందు కరకగూడెం మండలానికి చెందిన BRS 10 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కరకగూడెం మండల అధ్యక్షులు ఇగ్బాల్ హుస్సేన్ నేతృత్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షులు హుస్సేన్, జాడి శ్రీను, బరపాటి వెంకన్న, కోర్స ఆనంద్, మైనార్టీ అధ్యక్షులు రహీం పాషా, తదితరులు పాల్గొన్నారు.